మీ పిల్లలు బరువు తగ్గిపోయారా.. ఈ ఫుడ్స్ పెట్టాల్సిందే!
Samatha
6 November 2025
పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి ఏ సమయంలో ఎలాంటి ఆహారం పెట్టాలి? వారు బరువు పెరుగుతున్నారా? తగ్గుతున్నారా? అని నిత్యం గమనిస్తుంటారు.
ముఖ్యంగా పిల్లలకు వీలైనంత వరకు ఇడ్లీ, దోశ లాంటివి అలవాటు చేయడం చాలా అవసరం, ఇడ్లీలో కొద్దిగా నెయ్యి చేర్చి పెట్టడం వలన వారు ప్రతి టిఫిన్ చాలా ఇష్టంగా తింటారు.
అయితే కొంత మంది పిల్లలు మాత్రం ఫుడ్ తినే దగ్గర చాలా మారం చేస్తుంటారు. ఎప్పుడూ సమయానికి తగినట్లుగా ఆహారం తీసుకోరు. కానీ దీని వలన త్వరగా బరువు తగ్గుతారు.
అందుకే తప్పకుండా వారికి ఇష్టమైన ఫుడ్ పెట్టడం వలన వారు త్వరగా కడుపు నిండా ఆహారం తినే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారం పెట్టడం వలన వారు బరువు పెరుగుతారంటే?
పిల్లలు త్వరగా బరువు పెరగాలి అంటే, వారికి తప్పకుండా అరటి పండు తినిపించడం తప్పని సరి, ఇది చాలా త్వరగా బరువు పెరగడానికి సహాయపడటమే కాకుండా, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.
అలాగే తప్పకుండా మీ పిల్లల డైట్‌లో వాల్ నట్స్, ఖర్జూరం, పిస్తా, జీడిప్పు లాంటి ఉండటం మంచిది. వీటి వలన పిల్లలు త్వరగా బరువు పెరిగి, ఆరోగ్యంగా ఉంటారు.
అదే విధంగా పప్పు, బియ్యం, కొన్ని కూరగాయలన్నింటిని కలిపి వాటన్నింటిని ఉడక బెట్టి, నెయ్యి వేసి, మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలి. దీని వలన వారు ఎక్కువ ఆహారం తీసుకుంటారు.
అదే విధంగా మీరు పిల్లలకు పెట్టే ఆహారంలో ఎక్కువ నూనె ఉండకుండా చూసుకోవాలి. ఇదిఆకలిని తగ్గిస్తుంది. అదే విధంగా తప్పకుండా రోజుకు రెండు రకాల ఫ్రూట్స్ పెట్టడం మంచిది.