వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు పిల్లలకు పెట్టాల్సి న ఫుడ్ ఇదే!
Samatha
25 july 2025
Credit: Instagram
పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
ఇక తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలా అని తెగ ఆలోచిస్తుంటారు. కొన్ని సార్లు అయోమయానికి గురి అవుతుంటారు.
అయితే ఏ ఫుడ్ చిన్నపిల్లలకు పెట్టడం మంచిది. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే? ఎలాంటి ఆహారం వారికి పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం.
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ప్రతి రోజూ ఉదయం అల్పాహారంగా పిల్లలకు కోడిగుడ్డు పెట్టాలంట.
వేరు శనగల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచి, శక్తిని అందిస్తాయి. అలాగే దీనిలోని విటమిన్ ఇ, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో రాగులు ఒకటి. ఇందులో ఐరన్ , కాల్షియం, పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
ఎదుగుతున్న పిల్లలకు తప్పకుండా వారానికి రెండు సార్లు చేపలు పెట్టాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి, కంటి చూపు పెరుగుదలకు, జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతగానో దోహద పడుతాయంట. అలాగే ప్రతిరోజు ఒక పండు పిల్లలకు పెట్టాలంట.