పాలకూర ఎక్కువ తినడం వలన కలిగే సమస్యలు ఇవే!

Samatha

18 November 2025

పాల కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన తప్పకుండా పాల కూర తినాలని చెబుతారు వైద్య నిపుణులు.

అయితే పాల కూర ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని ఎక్కువగా తినడం వలన చాలా  సమస్యలు వస్తాయంట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాల కూరలో విటమిన్స్, మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉన్నప్పటికీ దీనిని అధిక మొత్తంలో తినడం వలన ఇది శరీరం పై ప్రతికూల ప్రభావం చూపుతుందంట.

పాల కూరలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. అదువలన పాలకూరను ఎక్కువ మొత్తంలో తినడం వలన ఇది మూత్రపిండాల్లో రా్ల ఏర్పడటానికి కారణం అవుతుందంట.

అందువలన మూత్రపిండాల సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో అధిక మొత్తంలో పాలకూర తీసుకోకూడదంట.

అదేవిధంగా, థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు కూడా పాలకూర ఎక్కువ తినకూడదంట. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుపై చాలా ప్రభావం చూపుతుందంట.

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా పాలకూర తినకూడదంట. దీని వలన గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

పాలకూరలో  ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన ప్రతి రోజూ పాలకూర తినడం వలన ఇది అలసట, తలనొప్పి, బలహీనతలకు కారణం అవుతుందంట