ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, పోషకాల వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటారు.
అయితే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ , రోజూ తినడం మాత్రం అస్సలే ఆరోగ్యానికి మంచిది కాదంట. కాగా ,రోజూ ఓట్స్ తినడం వలన కలిగే సమస్యలు ఏవి అంటే?
రోజూ క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వలన ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరికి కారణం అవుతుందంట.
ఓట్స్ ప్రతి రోజూ తినడం వలన ఇవ కొందరిలో విరేచనాలు, అలసట, అలర్జీ, చర్మ చికాకు, చర్మం పై మంట వంటి సమస్యలను కూడా కలిగిస్తాయంట.
ఓట్స్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వీటిని తీసుకునే క్రమంలో చక్కెర, వేరుశనగ, తేనే, పండ్లు, పాల వంటి వాటితో కలిపి తీసుకుంటారు.
అయితే ఇలా ప్రతి రోజూ తినడం వలన ఇది బరువు పెరగడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.
ఓట్స్ ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇవి చర్మపు దద్దుర్లు, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు లేదా జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలకు కారణం అవుతాయి.
ఓట్స్‌లో ఫైటేట్స్ లేదా ఫైటిక్ యాసిడ్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఇనుము, జింక్ , కాల్షియం వంటి ఖనిజాలతో బంధించి, శరీరంలో వాటి శోషణను తగ్గిస్తాయి.