చలికాలంలో జామ పండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. అయితే కొంత మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటే, మరొకొందరు అసలు జామ పండ్లు తినడానికే భయపడిపోతుంటారు.
చలికాలంలో జామ పండ్లు తినడం వలన దగ్గు, జలుబు, కఫం సంబంధ సమస్యలు వస్తాయని జామకాయ తినడానికి ఇష్టపడరు.
కానీ , శీతాకాలంలో జామకాయ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన చలికాలంలో జామ పండు తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తుందంట.
గుండె ఆరోగ్యానికి జామ పండ్లు చాలా మంచివి. చలికాంలో వీటిని తినడం వలన ఇది రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
జామ పండ్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన శీతాకాలంలో జామకాయ తినడం వలన జీర్ణ సమస్యలు తగ్గించి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, డయాబెటీస్ పేషెంట్స్‌కు ఇది వరం అని చెప్పాలి. రోజూ తినడం వలన రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
జామకాయలో యాంటీ ఆక్సిడేంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్ రాకుండా చేస్తాయంట.