అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు.
ముఖ్యంగా ఎముకల బలహీనత ఉన్నవారు ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వలన ఎముకలు దృఢంగా తయారు అవుతాయని చెబుతుంటారు. కానీ అరటి పండు మంచిదే అయినప్పటికీ కొన్ని సార్లు ప్రమాదకరం కావచ్చునంట.
అరటి పండును కొన్ని ఆహారపదార్థాలతో కలిపి అస్సలే తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల. కొన్ని రకాల ఫుడ్‌తో అరటి పండు తీసుకోవడం చాలా ప్రమాదకరం అవుతుందంట.
ఎప్పుడూ కూడా మాంసాహారం అరటి పండు కలిపి తీసుకోకూడదంట. దీని వలన కడుపు నొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంట.
అలాగే ఎప్పుడు కూడా బ్రెడ్, బేక్ చేసినటువంటి పదార్థాలతో అరటి పండ్లు తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, దీని వలన గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయంట.
చాలా మంది పాలతో అరటి పండు తింటారు కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట, పాలతో అరటి పండు తినడం వలన ఇది కడుపులో అసౌకర్యానికి కారణం అవుతుంది.
ఇక కొంత మంది చిప్స్, స్నాక్స్ తింటూ అరటి పండు తింటారు. కానీ ఇలా తినడం వలన కూడా అనారోగ్య సమస్యలు దరి చేరే ఛాన్స్ ఉంది కాబట్టి చిప్స్ , కారం ఉన్నవి తినే సమయంలో అరటి పండు తినకూడదంట.
అదే విధంగా ఎట్టిపరిస్థితుల్లో టీ లేదా కాపీ తాగుతూ అరటి పండు తినకూడదంట. అలాగే పరగడుపున అరటి పండు తినడం వలన శరీరంలో చక్కెరస్థాయిలు పెరిగిపోతాయి. ఇది చాలా ప్రమాదకరం.