ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుందా.. అయితే తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

Samatha

12 july  2025

Credit: Instagram

తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఇక కొందరు పదే పదే నీరసానికి గురి అవుతుంటారు.

కొద్ది సేపు నడవగానే అలసటకు లోను అవుతారు. అయితే ఇలా పదే పదే అలసట నీరసంగా అనిపిస్తే తప్పక కొన్నిరకాల ఫుడ్ తీసుకోవాలంట.

డార్క్ చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన రోజుకు కనీసం ఒకటి తినడం వలన అలసట తగ్గుతుందంట.

అరటి పండ్లలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందువలన అరటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే శక్తి లభిస్తుదంట.

ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తింటే అలసట మీ దరిదాపుల్లోకి కూడా రాదంట. గుడ్డులో కొవ్వు, ఐరన్, విటమిన్స్, బి12 పుష్కలంగా ఉంటాయి.

ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసం, అలసటతో బాధపడే వారు ప్రతి రోజూ రెండు నుంచి మూడు ఖర్జూరాలు తినడం వలన నీరసం తగ్గుతుందంట.

స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ లలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అలసట నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి.