పొడవాటి, నల్లటి కురులు ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది. కానీ ఇప్పుడున్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం వలన చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.
జుట్టు రాలడం, డాండ్రఫ్, వంటి సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడి జుట్టు ఒత్తుగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలంట.
పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, విటమిన్స్ , ఫోలెట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకుంటే, జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట.
అత్యధిక ప్రోటీన్ ఉంటే వాటిలో ఎగ్స్ ఒకటి. అయితే ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందంట.
తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా, కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్, జింక్ వంటివి ఉంటాయి. ఇవి కురులకు బలాన్ని ఇస్తాయి.
సాల్మాన్ చేపలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందువలన వీటిని ఎక్కవగా తీసుకోవడం వలన జుట్టు పెరుగుతుంది.
సిట్రస్ ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచిది. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వలన ఇవి జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
చిక్కుల్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వీటిని ప్రతి రోజూ తీసుకుంటే జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయంట.