పాలిచ్చే తల్లులకు అలర్ట్.. ఈ ఫుడ్ తిసుకుంటే ప్రమాదమే!
Samatha
2 novembar 2025
తల్లి కావడం గొప్పవరం. గర్భం దాల్చిన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుటది. అయినా కొన్ని సార్లు తెలియక ఆహారం విషయంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు.
అయితే పాలిచ్చే ప్రతి తల్లి కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరం ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.
పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితిల్లోనూ ఎక్కువ స్పైసీ ఉండే ఆహారాలు తీసుకోకూడదు. అలాగే బయట ఫుట్ పాత్ ఉండే ఆహారాలకు దూరం ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
బిర్యానీ, ఎక్కువ మసాలా ఉంటే ఆహారపదార్థాలకు చాలా దూరం ఉండాలంట,ఎందుకంటే దీని వలన ఇది బిడ్డకు జీర్ణసంబంధమైన సమస్యలను తీసుకొస్తుందంట. అంతే కాకుండా వారిలో గ్యాస్, ఎసిడిటి సమస్యలకు కూడా కారణం అవుతుందంట.
అలాగే పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ, టీలు తాగకూడదంట. టీ, కాఫీల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
వారి ఎదుగుదలకు ఆటంకం కావడమే కాకుండా, జీర్ణసంబంధమైన సమస్యలను కూడా తీసుకొస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వీలైనంత వరకు వీటికి చాలా దూరం ఉండాలంట
ఇక చాలా మంది వెల్లుల్లి తింటే పాలు బాగా పడుతాయని, వెల్లల్లుని ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పాలిచ్చే తల్లులు ఎక్కువ మొతాదులో మాంసాహారం కూడా తీసుకోకూడదంట. ఇది పిల్లలకు సరిగా జీర్ణం కాకపోవడం వలన వారిలో కడుపు నొప్పికి కారణం అవుతుందంట.