రోజూ ఎగ్ తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

Samatha

8 november 2025

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి.

ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్రమం తప్పకుండా గుడ్లు తినడం వలన ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

కోడి గడ్డును ఉడక బెట్టి తీసుకోవడం వలన  ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని వలన స్ట్రోక్, లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధుల నుంచి సులభంగా బయటపడవచ్చు

రోజూ ఎగ్ తినడం వలన ఇది రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా ,ఇది మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. దీనిని తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

కంటి సమస్యలతో బాధపడే వారు ప్రతి రోజు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది కంటి ఆరోగ్యానికి మెరుగు పరుస్తుంది. ఎందుకంటే గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

రోజూ కోడి గుడ్డు తినడం వలన ఇది ఎముకలను బలంగా తయారు చేస్తుంది. ఇందులో పుష్కలంగా విటమిన్ సి, కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.