చిటికెలో తలనొప్పి తగ్గించే ఫ్రూట్స్ ఇవే.. తింటే ఎంత హాయో మరి!
Samatha
23 November 2025
తలనొప్పి వలన కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారి తలనొప్పి వచ్చిందంటే చాలు అది చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అసలు ఏ పని చేయడానికి వీలులేకుండా చేస్తుంది.
అయితే తలనొప్పి అనేది కొందరికి అనారోగ్య సమస్యల వలన వస్తే, మరికొంత మందికి, నిద్రలేమి, అధిక ఒత్తిడి, పనిభారం వలన వస్తుంటుంది.
ఇక కొంత మంది మైగ్రేన్ వలన అధిక తలనొప్పితో బాధపడుతుంటారు. కొందరు సహజమైన తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.
తల నొప్పి ఎలాంటిదైనా సరే, ఈ చిన్న చిట్కాలతో చిటికెలో తగ్గించ వచ్చునంట. అది ఎలా అంటే? కొన్ని రకాల పండ్లు తినడం వలన తల నొప్పి త్వరగా తగ్గిపోతుందంట. ఆ పండ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది తలనొప్పి, మైగ్రేన్ లక్షణాలను చాలా త్వరగా తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
యాపిల్ పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ప్రతి రోజూ ఒక యాపిల్ పండు తినడం వలన తలనొప్పి దరి చేరదంట,
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే శరీరానికి విశ్రాంతి కలిగిన భావన కలుగుతుంది. అయితే ఇది తినడం వలన తలనొప్పి చిటికెలో తగ్గిపోతుందంట.
అరటి పండు ఆరోగ్యానికి చేసే మేలు వివరించలేనిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని రోజూ తినడం వలన మైగ్రేన్ , తలనొప్పి చాలా త్వరగా తగ్గిపోతుందంట.