సపోటా తినడం వలన కలిగే లాభాలు ఇవే!

Samatha

13 July 2026

సపోటా పండు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. కానీ కొంత మంది వీటిని తినడానికి అస్సలే ఇష్టపడరు.

సపోటా

సపోటా పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంట.

పోషకాలు పుష్కలం

కాగా, ఇప్పుడు మనం సపోటా పండు తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో, వివరంగా తెలుసుకుందాం పదండి.

లాభాలు

సపోటాలో గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన శరీరానికి తక్షిణ శక్తిని అందిస్తుంది.

శరీరానికి తక్షణ శక్తి

అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

అంతే కాకుండా ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఎముకలు బలపడతాయి.

ఎముకల ఆరోగ్యం

సపోటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఎక్కువగా ఉండటం వలన ఇది జలుబు, దగ్గు, వంటి సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

దగ్గు, జలుబు

సపోటాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది బ్లడ్ ఫ్రెషర్ తగ్గించి, బీపీ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది.

బీపీ, కంట్రోల్