గింజలు కాదు మీ పాలిట వరాలు..వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఎన్ని లాభాలో..
Samatha
2 July 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది మొక్కజొన్నలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. చాలా మంది ఫేవరెట్ కూడ ఇది.
వఱ్సాకాలం
కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో మొక్క జొన్నలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.
మొక్క జొన్నలు
వర్షాకాలంలో మొక్క జొన్న తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఈ సమయంలో వీటిని తినడం వలన జలుబు దగ్గు తగ్గుతాయి.
ఆరోగ్యానికి మేలు
అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువలన ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
మొక్కజొన్నల్లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని ఈ సమయంలో తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
కార్బోహైడ్రేట్స్
ప్రతి రోజూ మొక్క జొన్న గింజలు గుప్పెడు తినడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
శక్తి
మొక్క జొన్నలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
కంటి చూపు
అలాగే ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.