చలికాలంలో పెరుగు తినవచ్చా?

Samatha

15 November 2025

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెరుగు తినడం వలన జీర్ణ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇక వేసవిలో చాలా మంది ఎంతో ఇష్టంగా పెరుగు తింటుంటారు. కానీ చలికాలం వస్తే చాలు ఎక్కువగా పెరుగు తినకూడదు అంటారు.

మరి చలికాలంలో పెరుగు తినవచ్చా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన పెద్దవారు చలికాలంలో పెరుగు తినకూడదు, ఇది శ్వాస కోశ సమస్యలను పెంచుతుంది. జలుబు , దగ్గు వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు.

కానీ ఇవన్నీ అపోహలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో పెరుగు తినడం వలన ఎలాంటి  సమస్యలు ఉండవంట. దీనిని అన్ని కాలాల్లో తినడం మంచిదంట.

పెరుగులో ప్రోబయోటికస్, మంచి బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన చలికాలంలో పెరుగు తినడం వలన ఇది జీర్ణక్రియ  మెరుగు పరుస్తుంది. చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.

పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అందుకే చలికాలంలో పెరుగు ఎక్కువగా తినడం వలన ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

అందువలన పెరుగును చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టి తినకూడదంట, అలాగే చలికాలంలో రాత్రి సమయంలో పెరుగు తినడం మంచిది కాదంట.