సండే స్పెషల్.. తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై.. ఇలా చేస్తే రుచి అమోఘం!

Samatha

2 novembar 2025

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ముఖ్యంగా మటన్, బోటీ, తలకాయ కర్రీలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.

అదే తెలంగాణ స్టైల్‌లో ఈ వంటలు వండితే, ఆ రుచికి పేరు పెట్టాల్సిన పనేలేదు. అంత అద్భుతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ స్టైల్‌లో బోటీ కర్రీ  వండితే లొట్టలేసుకొని తినాల్సిందే.

అందుకే ఇప్పుడు మనం సండే స్పెషల్, తెలంగాణ స్టైల్‌లో బోటీ కర్రీ ఎలా వండాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏవి అంటే?

మటన్ బోటీ, 500 గ్రాములు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీస్పూన్, టమాట ఒకటి, కారం పొడి ,రెండు టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి వన్ టీ స్పూన్.

కారం, ఉప్పు, రుచికి సరిపడ, పసుపు, గరం మసాలా వన్ టీస్పూన్, నూనె 4 టీస్పూన్స్, పుదీనా, కొత్తి మీర గుప్పెడు, నీరు అవసరమైనంత.

ముందుగా వేడినీళ్లు కాచుకొని, అందులో బోటీ వేసి, నీటుగా శుభ్రంగా కడగాలి, తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసి, అది మునిగేంత నీరు పోసి, పసుపు, ఉఫ్పు వేసి ఉడికించాలి.

బోటి ఉడికిన తర్వాత దానిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మందపాటి కడాయి పెట్టి, అందులో నూనె పోసి, నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి మెత్తగా చేసుకొవాలి. తర్వాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత బోటి అందులో వేయాలి

బోటీ వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, మసాలాలు వేసి, 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొత్తిమీర, పూదీన వేసి రెండు నిమిషాలు ఉండనివ్వాలి. అంతే బోటీ రెడీ.