మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా? బెస్ట్ టిప్స్ ఇవే!

03  october 2025

Samatha

ముఖమే కాదు, దంతాలు కూడా అందాన్ని పెంచుతాయని అంటుంటారు. దంతాలు తెల్లగా ఉంటే వారు చాలా అందంగా కనిపిస్తుంటారు.

అయితే కొంత మంది దంతాలు మాత్రం పసుపు రంగులో, నలుపు రంగులో కనిపిస్తుంటాయి. అయితే దంతాల రంగు మారడంతో చాలా మంది ఇబ్బంది పడతారు.

వాటిని తెల్లగా చేసుకోవడానికి ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దంతాలు తెల్లగా అవ్వవు. అలాంటి వారికోసమే ఈ టిప్స్.

దంతాలపై ఉన్న నలుపు, పసుపు రంగు మరకలు పోవాలి అంటే కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటించాల్సిందేనంట ఇంతకీ ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

దంతాల రంగు మార్చడంలో నిమ్మకాయ, ఉప్పు కీలక పాత్ర పోషిస్తాయి.  ఈ రెండింటిని కలిపి దంతాలపై అప్లై చేస్తే పసుపు రంగు మరకలు తొలిగిపోతాయంట.

నలుపు లేదా పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చాలి అంటే కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్. దీనిని పొద్దున సాయంత్రం దంతాలకు అప్లై చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయంట.

ఆవాల నూనెలో అరటీస్పూన్ ఉప్పు కలిపి ఎనిమిది రోజుల పాటు దంతాలకు అప్లై చేయడం వలన దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయంట.  

ఈ వంటింటి చిట్కాలు ప్రతి రోజూ పాటిస్తే దంతాలపై మరకలు తొలిగిపోయి, తెల్లగా మిల మిల మెరిసిపోతాయంట. నల్ల మరకలు, పసుపు మరకలు లేకుండా పోతాయంట.