చక్కెర అతిగా తింటున్నరా.. గుండెకు ముప్పే!

01  october 2025

Samatha

అధిక చెక్కర తీసుకోవడం వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అధిక చెక్కర తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి, గుండె రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు అడ్డంకులుగా ఏఏర్పడతాయి.

దీంతొ ఈ అధిక చెక్కర వలన రక్తనాళాలు దెబ్బతిని, ఇవి గుండె జబ్బులకు కారణం అవుతుందంట.

కొంత మంది చక్కెర ఎక్కువ తినడానికి ఇష్ట పడుతుంటారు. కానీ దీని వలన రక్తం లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

అందుకే వీలైనంత వరకు చక్కెరను తగ్గించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఎలాంటి ఆహారాలు తీసుకోవడం మంచిదో చూద్దాం.

జోడించిన చక్కెరను తగ్గించి,  పండ్లు కూరగాయలు వంటి సహజమైన  ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంట.

శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. దీని వలన గుండె ప్రమాదం తగ్గుతుంది.

ముఖ్యంగా స్నాక్స్, పానీయాలు, సాస్ వంటి వాటిలో చక్కెర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి చాలా దూరం ఉండాలంట.