డ్రాగన్ ఫ్రూట్ గురించి ఈ నిజాలు తెలుసా? ఈ తప్పులు చేస్తే ఆస్పత్రికే..
09 July 2026
Krishna
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తినడం అలవాటు లేని వారు దీనిని ఒకేసారి అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు కావచ్చు. కాబట్టి అతిగా తినకూడదు.
కడుపు ఉబ్బరం
డ్రాగన్ ఫ్రూట్ తిన్నాక కొందరిలో నాలుక వాపు, చర్మంపై దద్దుర్లు, విపరీతమైన దురద వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. కాక్టస్ జాతి పండ్ల అలెర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
అలెర్జీ వచ్చే ప్రమాదం
డ్రాగన్ పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు పెద్ద మొత్తంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
బ్లడ్ షుగర్
ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన కొన్ని సాధారణ మందులతో ప్రతిచర్య జరపవచ్చు. కాబట్టి గుండె మందులు వాడేవారు డ్రాగన్ ఫ్రూట్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మందులతో ప్రతిచర్యలు
ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు మూత్రం లేదా మల విసర్జన రంగు తాత్కాలికంగా ఎరుపుగా మారవచ్చు. ఇందులోని సహజ పిగ్మెంట్ల వల్ల ఇది జరుగుతుందని, దీనివల్ల ఎలాంటి హాని లేదని నిపుణులు స్పష్టం చేశారు.
యూరిన్, మలం రంగు
సున్నితమైన కడుపు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తింటే వికారం లేదా కడుపు తిప్పడం రావచ్చు. అలాంటి వారు ఇతర ఆహారాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం మేలు.
ఖాళీ కడుపుతో తింటే
గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు దీనిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే పిల్లలకు రోజుకు 50-75 గ్రాముల చిన్న పోర్షన్లలో మాత్రమే పరిచయం చేయాలి.
గర్భిణీలు - పిల్లలకు సూచన
సాధారణ వ్యక్తులు రోజుకు సగం మధ్యస్థ పరిమాణంలో ఉండే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం సురక్షితం. దీనివల్ల బాడీకి షుగర్ ఎక్కువ కాకుండా పోషకాలు అందుతాయి. ఏదైనా సరే అతిగా తింటే ప్రమాదమే.