వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసా?

30 September 2025

Samatha

ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒక్కసారైనా సరే తలస్నానం చేస్తుంటారు.కానీ కొంత మంది మాత్రం వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేస్తారు.

ఇక కొంత మంది అయితే ప్రతి రోజూ తల స్నానం చేస్తుంటారు.కాగా, అసలు వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయడం మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం.

జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేయాలంట. ఒక వేళ మీ జుట్టు  ఎక్కువ జిడ్డుగా అనిపించకుండా, పొడిగా ఉండకపోతే వారానికి ఒకసారి తలస్నానం చేయడం ఉత్తమం.

కొందరి జుట్టు చాలా త్వరగా జిడ్డుగా మారుతుంది. అయితే అలాంటి వారు కనీసం  వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదంట.

ఇక కొంత మంది ఎక్కువగా జుట్టుకు రంగులు వేసుకుంటూ.. దానిని డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించుకుంటారు.అలాంటి వారు ఎక్కువగా తలస్నానం చేయకూడదంట.

ఎవరి జుట్టు అయితే ఎక్కువ పొడిగా ఉంటుందో వారు వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

కొందరికి జుట్టు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వారు ఏ చిన్న పని మీద బయటకు వెళ్లినా జుట్టు మురికిగా మారుతుంది. వారు వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలంట.

అలాగే కొందరికి తలపై ఎక్కువగా చెమట వస్తుంటుంది. అయితే అలాంటి వారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం మంచిదంట.