కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ తప్పకుండా కప్పు కాఫీ తాగుతుంటారు.
ఇక కొంత మంది ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగితే, మరికొంత మంది మధ్యాహ్నం లేదా, సాయంత్రం సమయంలో కాఫీ తాగుతుంటారు.
అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని ఖాళీ కడుపుతో మాత్రం అస్సలే తాగకూడంట. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉందంట.
ఖాళీ కడుపుతో టీ తాగడం వలన కడుపులో ఆమ్లతత్వం పెరిగి, కడుపు చికాకు, కడుపు నొప్పి, వంటి జీర్ణ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంట.
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వలన ఇది మూత్ర విసర్జనకు కారకం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతే కాకుండా ఇది డీ హైడ్రేషన్ సమస్యను తీవ్రతరం చేస్తుందంట.
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కాఫీ ఖాళీ కడుపుతో తాగడం వలన ఇది కార్టిసాల్ అనే హార్మోన్‌ను పెంచి, ఒత్తిడి, భయాందోళన వంటి సమస్యలను కలిగిస్తుందంట.
ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదంట. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తాయంట.
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వలన ఇది అలసట, నీరసం, కొన్ని సార్లు కళ్లు తిరగడం వంటి సమస్యలను పెంచుతుందంట.