మెంతి గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదంటే? 

Samatha

21 November 2025

మెంతి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఆకులను వటల్లో ఉపయోగించుకోవడం, లేదా మెంతి గింజలను వీటి ఏ విధంగా తీసుకున్నా చాలా ప్రయోజనాలు ఉంటాయంట.

మెంతి గింజలను ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు. కాటా, వీటిని ఎలా తీసుకోవడం మంచిదో ఇప్పుడు చూద్దాం.

మెంతి గింజలను రాత్రి పూట నానబెట్టి, ఉదయం ఆ గింజలు తినడం లేదా, ఆ నీరు తాగడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందంట.

ప్రతి రోజూ నానబెట్టిన మెంతి గింజలు లేదా మెంతి నీరు తాగడం వలన ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, చర్మం, జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందంట.

ప్రతి రోజూ తప్పకుండా మెంతి నీరు తాగడం వలన ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

మెంతి నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఇందులో ఉండే జీర్ణ ఎంజైమ్‌లను సంక్రియం చేస్తుంది. దీంతో మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి.

పేగు ఆరోగ్యానికి కూడా మెంతి నీరు చాలా మంచిది. ఇవి పేగు కదలిలను మెరుగు పరిచి, గట్ బ్యాక్టీరియాను పెంపొందిస్తుందంట.

మెంతిగింజల నీరు ప్రతి రోజూ తాగడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటీస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందంట.