టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కేవే. ఈ అమ్మడు తన అందం, నటనతో ఎంతో మంది మదిని దోచుకుంది.
వర్షం సినిమాతో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది.
ఇక ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో వరసగా స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
తర్వాత ఈ బ్యూటీ ఆఫర్స్ తగ్గడంతో, కోలీవుడ్, బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి తన సత్తా చాటింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఇప్పటికీ వరస సినిమాలతో ఈ బ్యూటీ ఫుల్ జోష్‌లో ఉంది.
టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో ఇప్పటికీ కుర్రహీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ తన అంద చందలాలతో ఆకట్టుకుంటుంది. అయితే ఈ మధ్య ఈ చిన్నది కోలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు అనేక రూమర్స్ వస్తున్నాయి.
అయినప్పటికీ ఈ బ్యూటీ మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా ఈ చిన్నది పెట్టిన పోస్ట్ దానికి బలం చేకూర్చేలా ఉందంటున్నారు పలువురు.
రీసెంట్‌గా త్రిష కోలీవుడ్ హీరో బర్త్‌డే రోజే.. ప్రేమపై పోస్టు పెట్టారు. అందులో పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుందని పేర్కొన్నారు.
దీంతో ప్రస్తుతం అందరూ ఈ పోస్టు గురించే ముచ్చటిస్తున్నారు. రూమర్స్ పెట్టిన వేళ త్రిష పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.