ఆ వ్యాధితో పోరాటం చేశా.. సారా టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్!
samatha
16 MAY 2025
Credit: Instagram
pcosతో పోరాటం చేశానంటూ సారా టెండూల్కర్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెళ్లడించిది.ప్రస్తుతం ఆమె చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాను మాట్లాడుతూ.. ఏజ్ పెరిగే కొద్దీ తనకు హార్మోన్ల మొటిమలు చాలా ఉండేవి. అవి పీసీఓఎస్ వల్ల రావడం వలన చాలా ఇబ్బంది పడేదాన్ని అని తెలిపింది.
ఆమెకు ఏడవ తరగతిలో ఉన్నప్పుడే మొటిమలు రావడం ప్రారంభించాయంట. కానీ అవి ఏమో తనకు అంతగా తెలియకపోవడంతో ఎక్కువ కేర్ తీసుకోలేదంట.
పీసీఓఎస్ రావడంతో తనకు మొటిమలు ఎక్కువ అవ్వడం, చర్మం జిడ్డుగా మారడం, చాలా త్వర త్వరగా బరువు పెరగడం జరిగిందంట.
దీంతో సారా టెండూల్కర్ తన తల్లి అంజలి టెండూల్కర్‌ను ఈ మొటిమలు చాలా అవుతున్నాయి. వాటి నుంచి బయటపడటం ఎలా అంటూ అడగగా, ఆమె క్రీమ్స్ సజెస్ట్ చేసిందంట.
తన తల్లి చెప్పిన క్రీమ్స్, తన స్నేహితులు చెప్పిన టిప్స్ ఇలా ఎన్ని చేసినా మొటిమలు మాత్రం తగ్గలేదట.యాంటీ బయోటిక్స్ ఇలా ఎన్ని యూజ్ చేసినా ఫలితం లేదంట.
తర్వాత సోనోగ్రఫీలో సారాకు పీసీఓఎస్ సమస్య ఉన్నట్లు తేలిందంట. దీంతో వారు మంచి ఆరోగ్య నిపుణుడిని సంప్రదించి డైట మెటైన్ చేయగా తాను చాలా బలహీన పడిందంట.
చివరకు ఓ ఎండోక్రినాలజిస్ట్ ఆమెకు కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పడంతో తాను డైట్ చేయడం, వ్యాయామం చేయడం చాలా జాగ్రత్తలు తీసుకొని చివరకు ఆ సమస్య నుంచి విముక్తి పొందినదంట.