ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తే అన్ని కోట్లా..!! అబ్బో తమన్నా మామూల్ది కాదుగా..

Rajeev 

28 November 2025

సినీ పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకుంది ఈ వయ్యారి భామ. 

ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. పాన్ ఇండియా మూవీ లవర్స్, అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటారు.

2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాది చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

దాదాపు 20 సంవత్సరాలుగా వెండితెరపై కథానాయికగా కొనసాగుతుంది ఈ బ్యూటీ. 33 ఏళ్ల ఈ బ్యూటీ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్. 

ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన తమన్నా.. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. 

 ఒక్కో ప్రాజెక్ట్ కోసం తమన్నా దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుందట. ఒక్క స్పెషల్ సాంగ్ కోసం రూ.1కోటి నుంచి రూ.2 కోట్లు తీసుకుంటుందట.