అందంతో మాయ చేస్తున్న వర్ష.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

samatha 

8 MAY 2025

Credit: Instagram

జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో వర్ష ఒకరు. ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడును చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అంత క్యూట్‌గా ఉంటుంది ఈ బ్యూటీ

ఇక ఎప్పుడూ తన కామెడీతో అందరినీ నవ్విస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా డ్యాన్స్ కూడా అదరగొడుతుంది. ఇక ఇమ్మానుయేల్‌కు జోడిగా నటించి ఈ బ్యూటీ చాలా పాపులారిటీ సంపాదించింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు మతి పొగొడుతుంది.

తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ లంగాఓణీలో తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. పింక్ కలర్ లంగాఓణీలో చూడ చక్కగా కనిపిస్తుంది ఈ బ్యూటీ.

లేత గులాబీ రంగు లెహంగాలో పరువాల విందు ఇస్తుంది ఈ అమ్మడు. ఇక అందాల ముద్దుగుమ్మ ఫొటోలు చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.