ఓజీతో హిట్ కొట్టినా.. ఈ క్యూట్ భామకు క్రీజీ ఆఫర్స్ రావడం లేదా.? 

Rajeev 

25 November 2025

సౌత్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ ఎదురుచూస్తోంది హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తుంది.

ఇటీవలే ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

అంతకు ముందు న్యాచురల్ స్టార్ నాని జోడిగా సరిపోదా శనివారం చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. 

 నటి ప్రియాంక మోహన్ స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు. తండ్రి తమిళుడు. ఈ అమ్మడు 20 నవంబర్ 1994న బెంగళూరులో జన్మించింది.

ఈ ముద్దుగుమ్మ 2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. 

ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. 

ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఉన్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.