బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సంచలనం.. 10 సంవత్సరాల తర్వాత బాలయ్య మూవీలో నటిస్తున్న బ్యూటీ!
samatha
Pic credit - Instagram
అందాల ముద్దుగుమ్మ హర్షాలీ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
భజరంగీ భాయిజాన్ సినిమాలో నటించిన మున్నీ పాపను ఎవరు మర్చిపోరు.. ఎందుకంటే ఆ మూవీలో హీరోకు ఏ మాత్రం తగ్గకుండా తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నారి.
ఈ సినిమా బాలీవుడ్‌లో 2015లో రిలీజ్ అయ్యి రికార్స్ క్రియేట్ చేసింది. ఏడేళ్ల వయసులోనే తన నటనతో ఈ బ్యూటీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో హర్షాలీ చాలా క్యూట్‌గా కనిపిస్తూ, మాటలు లేకున్నా, తన హావభావాలతో అందరినీ కట్టిపడేసింది. ప్రతి ఒక్కరి మనసు దోచేసింది.
అయితే ఈ బ్యూటీ ఈ సినిమా తర్వాత ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ మళ్లీ థియేటర్‌లో సందడి చేయనుంది.
హర్షాలీ మల్హోత్రా బాలకృష్ణ అఖండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ బ్యూటీ అఖండ 2 సినిమాలో జనని పాత్రలో నటించినట్లు సమాచారం.
హర్షాలీ మల్హోత్రా రెండో సినిమా ఇది. ఇక ఈ మూవీ రిలీజ్‌లో భాగంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది, బ్లూ కలర్ డ్రెస్‌లో తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది.