చిన్నవయసులోనే లైంగిక వేధింపులు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

Rajeev 

24 November 2025

హాట్ బ్యూటీ అయేషా ఖాన్.. ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్‌ బుష్‌ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.

ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది. అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు. 

బెంగాలీ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు పంచుకుంది. 

చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. తన తండ్రి స్నేహితుడు తన తప్పుగా ప్రవర్తించాడని తెలిపింది. 

అతను నా దగ్గరకు వచ్చి నీ వక్షోజాలు బాగున్నాయ్ అని చెప్పి బైక్ పై వెళ్ళిపోయాడు. ఆ క్షణం నాకు ఏం అర్ధం కాలేదు. ఆతర్వాత చాలా బాధపడ్డాను అని తెలిపింది.