సూట్‌లో అదిరిపోయిన ఐశ్వర్యరాయ్.. ఫొటోస్ వైరల్!

Samatha

9 November 2025

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం, మాజీ విశ్వసుందరిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన అంద చందాలతో ఎంతో మంది అభిమానాలను సంపాదించుకున్న ఈ బ్యూటీ, తన నటతో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ గా ఓ వెలుగు వెలిగింది.

బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేసి, స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. నార్త్ టు సౌత్ వరకు చాలా సినిమాల్లో నటించి,వావ్ అనిపించింది.

ఈ బ్యూటీ చాలా వరకు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిది. కానీ వివాహమై,ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరమైంది.

తర్వాత మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి సెలెక్టివ్ పాత్రలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడు బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

ఇక ఈ బ్యూటీకి సంబంధించిన ఏ వార్త అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అభిషేక్ బచ్చన్‌తో విడిపోతున్నట్లు పుకార్లు వచ్చాయి.

ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కానీ ఐశ్వర్యరాయ్ వీటిని కొట్టి పడేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా, సూట్‌లో లేడీ బాస్‌లా కనిపించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.