తెలుగులో తగ్గించి.. అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టిన మడోన్నా సెబాస్టియన్

Rajeev 

25 November 2025

 అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. ఈ అమ్మడు అక్టోబర్ 1, 1992న కేరళలోని చెరుపుజలో జన్మించింది. 

ఈ ముద్దుగుమ్మ  బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ స్టడీలో పట్టా అందుకుంది.

ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది.

ఈ షో ద్వారా ఫేమస్ అయ్యి తొలిసారి సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. అలాగే సినిమాల్లోనూ మంచి సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే అల్ఫోన్స్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోనా, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "ప్రేమమ్" చిత్రం 2015లో విడుదలైంది.

ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగు సినిమాల కంటే తమిళ్, మలయాళ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది.