ఆచి తూచి అడుగులేస్తున్న అందాల భామ.. గౌరీ సినిమాలకోసం ఫ్యాన్స్  వెయిటింగ్..

Rajeev 

24 November 2025

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాతో సినీరంగంలో పాపులర్ అయ్యింది గౌరీ కిషన్.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు.

ఇదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. అందులో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 

గౌరి ప్రస్తుతం హీరోయిన్‏గా మూవీస్ చేస్తుంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

తెలుగులోనూ ఓ సినిమా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేసింది.

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా స్పీడ్ గా సినిమాలు చేయడం లేదు.