ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరేనట

16 October 2025

Anand T 

Images: Pinterest

ప్రపంచంలోని టా 10 శక్తివంతమైన వ్యక్తుల జాబితాను చూసుకుంటే అందులో మొదటి స్థానంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

రెండో ప్లేస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. ఈయన తన దగ్గర ఉన్న సైనిక శక్తి సహజ వనరుల ద్వారా భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇక మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈయన ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తి అయిన అమెరికాను ఈయన నడిపిస్తున్నారు. 

ఇక నాలుగో స్థానంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. ఈమె యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించారు. ఈమె నిర్ణయాలు కూడా అంతర్జాతీయ విషయాలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఇక ఐదో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు.

ఇక ఆరో స్థానంలో రోమన్ కాథలిక్ చర్చి మాజీ పోప్‌ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది కాథలిక్కులకు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన 21 ఏప్రిల్ 2025న అనారోగ్యంతో మరణించారు.

ఇక ఏడో స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. ఈయన తన ఫౌండేషన్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలనలో ప్రభావం చూపుతున్నారు. 

ఇక ఎనిమిదవ స్థానంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. ఇతను ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే దేశాన్ని నియంత్రిస్తున్నారు. 

ఇక తొమ్మిదో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందింది. జాతీయ భద్రత, ప్రపంచ దౌత్యంపై ఈయన బలమైన నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి.