ఆగస్టు 15న డొనాల్డ్ ట్రంప్,  వ్లాదిమిర్ పుతిన్‌ భేటీ

13 August 2025

Balaraju

ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్నారు.

అలాస్కా రాష్ట్రంలో ట్రంప్ - పుతిన్  భేటీ జరగనుంది. అమెరికాలోని 50 రాష్ట్రాలలో అలస్కా అతి పెద్ది కావడం గమనార్హం.

ఉత్తర అమెరికా వాయువ్య చివరన ఉన్న అలాస్కా రష్యాకు దగ్గరగా ఉంటుంది. రష్యా నుంచి దాదాపు 55 మైళ్ల దూరంలో ఉంటుంది.

ఉత్తర అమెరికా వాయువ్య చివరన ఉన్న అలాస్కా రష్యాకు దగ్గరగా ఉంటుంది. రష్యా నుంచి దాదాపు 55 మైళ్ల దూరంలో ఉంటుంది.

నిజానికి అలస్కా గతంలో రష్యాలో ఉండేది. 1867లో.. అమెరికా రష్యా నుండి అలాస్కాను 72 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది.

ఈ విధంగా అలాస్కా అమెరికాలో 50వ రాష్ట్రంగా అవతరించింది. ఇప్పుడు యూఎస్‌లోనే అతిపెద్ద రాష్ట్రంగా మారింది.

అలాస్కాలో అత్యధిక సంఖ్యలో హిమానీనదాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు లక్ష హిమానీనదాలు ఉన్నట్లు నిపుణులు చెబుతారు.

ఈ రాష్ట్రం చాలా చలిగా ఉంటుంది. ఇక్కడి జనాభా దాదాపు 7 నుండి 8 లక్షలు అని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

1977లో ట్రాన్స్-అలాస్కా పైప్‌లైన్ ప్రారంభమైనప్పటి నుండి అలాస్కా యూఎస్‌లో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంగా నిలుస్తోంది.