మీకు తెలుసా?.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట

14 October 2025

Anand T

మనుషుల్లో దురదృష్టవంతులు ఉన్నట్టు పాముల్లోనూ దురదృష్ట పాములు ఉంటాయని మీకు తెలుసా?

అవును వోల్ఫ్ స్నేక్ అనే ఈ పాము ప్రపంచంలోనే అంత్యంత దురదృష్టకరమైన పామట

ఈ వోల్ఫ్ స్నేక్‌ను లైకోడాన్ అని కూడా పిలుస్తారు. ఇది కొలుబ్రిడ్ పాముల జాతికి చెందినది. 

ఈ పామును దృరదృష్టకరమైన పాము అని ఎందకంటారంటే.. జనాలు కారణం లేకుండా ఈ పామును చంపేస్తుంటారట

ఈ పాము తరచూ జనావాసాల్లోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజల ఇళ్లలో కనిపిస్తుంది.

ఈ పాములో మూడు జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పశ్చిమ చంపారన్‌, బీహార్‌లో కనిపిస్తాయి. 

ఈ జాతుల పేర్లు కామన్ వోల్ఫ్, బార్డెడ్ వోల్ఫ్, ట్విన్ వోల్ఫ్ ,ఈ జాతి పాములు విషపూరితమైనవి కూడా కావు.

ఇవి కాటు వేస్తే మనిషి ప్రాణాలకు ఎలాంటి హానీ జరగదట. కానీ చాలా మంది ఈ పాము విషపూరితమైనదని భావించి దీనిని చూసినప్పుడు చంపేస్తారు