తక్కువ ఖర్చులో సమ్మర్‌ టూర్‌.. హైదరాబాద్‌లోని అద్భుతాలు ఇవిగో..

Jyothi Gadda

29 April 2025

చార్మినార్: హైదరాబాద్‌కు చిహ్నం. దీని చుట్టుపక్కల మార్కెట్లు ఎన్నో ఉంటాయి. మీకు కావాల్సిన ఎన్నో వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. పాతకాలపు నిజాముల నిర్మాణ శైలిని గుర్తు చేసేలా ఉంటుంది.

చౌహమల్లా ప్యాలెస్: నిజాం పాలకుల అధికారిక నివాసం. ఇదెంతో అందమైన కట్టడం. ముస్లిం, యూరోపియన్, రాజస్థానీ నిర్మాణ శైలులను కలిపి నిర్మించారు. దీనిని చూడాలంటే రెండు కళ్ళు చాలవు.

అనంతగిరి హిల్స్: అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న అందమైన కొండ ప్రాంతం ఇది. పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లడానికి మంచి ప్రదేశం. ప్రకృతిలో ఆనందంగా గడిపేయొచ్చు.

నెహ్రూ జూపార్క్‌: వేసవి వచ్చిందంటే చాలు.. బ‌హ‌దూర్‌పురాలో ఉన్న జూ పార్కుకు సందర్శకులు, పర్యాటకుల సందడి పెరిగిపోతుంది. వీకెండ్లలో అయితే సందర్శకుల రద్దీ విపరీతంగా ఉంటుంది.

గోల్కొండ కోట: 1143వ సంవత్సరంలో దీన్ని ఒక కొండపై నిర్మించారు.. దీన్ని మట్టి కోటగా వివరిస్తారు. మొదట వరంగల్ రాజు పాలనలో ఈ గోల్కొండ కోట నిర్మాణం మొదలైంది.

రామోజీ ఫిలిం సిటీ: వేసవి సెలవుల కోసం రామోజీ ఫిలిం సిటీ సరికొత్తగా తయారవుతుంది. హాలీ డే కార్నివాల్ పేరుతో అనేక రకాల ఈవెంట్స్ ను అక్కడ నిర్వహిస్తారు. 

ఓషన్ పార్క్: హైదరాబాదులో ఓషన్ పార్క్ కూడా ఉంది. ఇది అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఆక్వా స్నేక్, వేవ్ పూల్, జాక్ జూమ్ వంటి ఉత్కంఠ భరతమైన రైడ్స్ ఉంటాయి.

హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు హైదరాబాద్, ఇక్కడ బుద్ధుడిని చూసేందకు ఎంతో మంది ఇష్టపడతారు.