రిఫ్రిజిరేటర్‌లో గ్యాస్‌ నింపడానికి ఎంత ఖర్చు అవుతుంది?

18 May, 2025

Subhash

గ్యాస్‌ రీఫిల్‌ చేయడానికి ఎంత ఖర్చు మీ రిఫ్రిజిరేటర్‌ కూలింగ్‌ కాకపోవడానికి కారణాలు ఉన్నాయి. మీ ఫ్రిజ్‌ గ్యాస్ అయిపోవడం వల్ల కూడా కారణం కావచ్చు.

గ్యాస్‌ రీఫిల్‌

ఫ్రిజ్‌ గ్యాస్‌ ఎప్పుడు అవసరం రిఫ్రిజిరేటర్‌లో కూలింగ్‌ తగ్గినా, ఐస్‌ గడ్డకట్టకపోతే లేదా లోపల ఉన్న వస్తువులు చెడిపోతుంటే గ్యాస్‌ అయిపోయే అవకాశం ఉంది.

ఫ్రిజ్‌ గ్యాస్‌

రిఫ్రిజిరేటర్‌లో గ్యాస్‌ నింపడానికి సగటున రూ.1500 నుంచి రూ.3000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ధర ఫ్రిజ్‌ మోడల్‌, పరిమాణం బట్టి ఉంటుంది.

ఖర్చు ఎంత అవుతుంది?

టెక్నీషియన్లకు అదనపు ఛార్జీలు గ్యాస్ ధర కాకుండా టెక్నీషియన్‌ సర్వీస్‌ ఛార్జీని వసూలు చేస్తాడు. ఇది రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఈ ఛార్జ్‌ నగరం, సర్వీస్‌ కేంద్రం బట్టి మారవచ్చు.

ఛార్జీలు

పెద్ద నగరాల్లో  ఖర్చు ఎక్కువ ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో గ్యాస్‌ రీఫిల్‌ ఖర్చు చిన్న నగరాలు, పట్టణాల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అక్కడ ప్రాంతం ధరలను బట్టి ఉంటుంది.

ఖర్చు 

సింగిల్‌ డోర్‌ ఫ్రిజ్‌ తక్కువ గ్యాస్ను వినియోగిస్తాయి. రీఫిల్‌లు చౌకగా ఉంటాయి. కానీ డబుల్‌ డోల్‌ లేదా పెద్ద ఫ్రిజ్‌లకు ఎక్కువ గ్యాస్‌ అవసరం. దీని ఖర్చులలో తేడా ఉండవచ్చు.

సింగిల్‌ డోర్‌

గ్యాస్‌ నింపే ముందు రిఫ్రిజిరేటర్‌ పైపులో లీకేజి ఉందో లేదో తనిఖీ చేయడం ముఖ్యం. లీకేజిని సరిచేయకపోతే కొత్త గ్యాస్‌ కూడా త్వరగా అయిపోతుంది.

గ్యాస్‌

ఎల్లప్పుడు కంపెనీ అధీకృత సర్వీస్‌ సెంటర్‌ లేదా విశ్వసనీయ టెక్నీషియన్‌ నుంచి గ్యాస్‌ నింపండి. అప్పుడే గ్యాస్ నాణ్యత ఉంటుంది. వారంటీ కూడా ఉంటుంది.

కంపెనీ సర్వీస్‌ సెంటర్‌