గూగుల్‌ మ్యాప్‌లోని ఈ కలర్స్‌ గీతలు దేనిని సూచిస్తాయో తెలుసా?

17 May, 2025

Subhash

రోడ్డుపై భారీ ట్రిఫిక్‌ ఉన్నప్పుడు, వాహనాలు దాదాపు ఆగిపోయినప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో రెడ్‌ కలర్‌ గీతలు కనిపిస్తాయి. తీవ్రమైన ట్రాఫిక్‌ను సూచిస్తుంది.

రెడ్‌ లైన్‌- ట్రాఫిక్‌ జామ్‌

రోడ్డు మీద సాధారణ ట్రాఫిక్‌ ఉన్నట్లయితే గూగుల్‌ మ్యాప్‌లో లైన్‌లో నారింజ రంగు కనిపిస్తుంది. అంటే తక్కువ ట్రాఫిక్‌ ఉందని అర్థం.

ఆరెంజ్‌ లైన్‌- సాధారణ ట్రిఫిక్‌

ఒక రోడ్డు ఖాళీగా ఉండి వాహనాలు సాధారణ వేగంతో వెళ్తుంటే అప్పుడు లైన్స్‌ ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇది రహదారి ట్రాఫిక్‌ లేదని  సూచిస్తుంది.

గ్రీన్‌లైన్‌- ట్రాఫిక్‌ లేకుంటే

నావిగేషన్‌ సమయంలో మీరు అనుసరిస్తున్న మార్గం గూగుల్‌ మ్యాప్‌ ద్వారా నీలిరంగు గీతతో కనిపిస్తుంది. ఇది ట్రాఫిక్‌ కాదు. దిశను చూపించే మార్గం.

నీలి రేఖ - ఎంచుకున్న మార్గం

లోకేషన్‌లో పర్పుల్‌ కలర్‌ లైన్‌ ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు లేదా ప్రజారవాణా మార్గాలను సూచిస్తుంది. ఇది ట్రాఫిక్‌ డేటా ఆధారంగా ప్రత్యక్ష సూచనలు కావచ్చు.

పర్పుల్‌ లైన్‌ - ప్రత్యామ్నాయ మార్గం

బూడిద రంగు గీత ఉంటే మీరు ఎంచుకున్న మార్గాలను చూపుతుంది. కానీ గూగుల్‌ వాటిని ప్రత్యామ్నాయ మార్గాలుగా చూపిస్తుంది. ఇవి తక్కువ ట్రాఫిక్‌ ఉన్నవి

గ్రే లైన్‌ - ఇతర మార్గాలు

రోడ్డు నిర్మాణ పనులు లేదా హెచ్చరికలు వంటి కొన్ని సందర్భాలలో గూగుల్‌ ఎల్లో కలర్‌ గీతలు లేదా సంకేతాలను చూపుతుంది. ఇది మార్గాన్ని ప్రభావితం చేయవచ్చు.

పసుపు గీత- హెచ్చరిక

గూగుల్‌ మ్యాప్‌ ప్రమాదాలు, రోడ్డు అడ్డంకులు, లేదా ఇతర సమస్యలకు త్రిభుజాలు లేదా చిహ్నాల రూపంలో హెచ్చరికలను కూడా ఇస్తుంది. ఆ స్థానంలో సమస్య ఉండవచ్చని సూచిస్తుంది.

హెచ్చరిక గుర్తు- ప్రమాదం