శబరిమల కొండపైకి స్త్రీలకి నిషిద్ధం.. దీని వెనకున్న సైన్స్ ఏంటి.?

20 July 2025

Prudvi Battula 

కెరలోని పతనంతిట్ట జిల్లాలో ఉంది శబరిమల. ఇక్కడ ఆలయంలో హరిహర తనయుడు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

కార్తీక మాసంలో స్వామి మాల వేసుకొని 41 రోజుల దీక్ష తర్వాత ఉరుముడి తలపై పెట్టుకొని స్వామిలు మణికంఠుని దర్శనానికి వస్తారు.

అయితే ఇక్కడకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు ప్రవేశం నిషేధించబడింది. 10 లోపు 50 ఏళ్లపై బడిన స్త్రీలు వెళ్ళవచ్చు.

అయ్యప్ప బ్రహ్మచర్యాన్ని భంగపరచకుడదనే ఇలా చేస్తారని నమ్మకం. అయితే ఈ విషయాన్ని సైన్స్ మరో రకంగా చెబుతుంది.

శబరిమల మణికంఠుని దర్శనం కోసం దిట్టమైన కొండాలు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారి చాల కఠినం ఉంటుంది. సరైన మెట్ల మార్గం లేదు.

అలాగే ఈ కొండపై మాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని, ఇది స్త్రీల ఆరోగ్యానికి హానికరమని సైన్స్ చెబుతుంది. ఇది స్త్రీలలో ఋతుక్రమ సమస్యలకు కారణం అవుతుంది.

ఈ కఠినమైన మార్గంలో ప్రయాణం స్త్రీల గర్భ సంచికి హాని కలిగిస్తుంది. దీని కారణం భవిష్యత్తులో పిల్లలు పుట్టడం సమస్యగా మారవచ్చు.

అలాగే ఇక్కడి వాతావరణం మహిళలలో కొన్ని వ్యాధులకు కారణం కావచ్చు. అందుకే శబరి కొండపైకి స్త్రీలకు నిషిద్ధం ఉందని సైన్స్ చెబుతుంది.