జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో పిల్లన గ్రోవి ఉండాలట. రెండు ఫ్లూట్లను గోడకు 45 డిగ్రీల కోణంలో అలంకరణలా వేలాడదీస్తే అదృష్టం కలిసి వస్తుంది.
ఇంటిపై త్రిభుజాకారం జెండాను పెట్టుకోవాలి. తెలుపు, ఆకుపచ్చ, కాషాయం రంగులలో ఏదైనా ఒక రంగు మంచిదట. ఇది గుడ్ లక్ ఇస్తుంది.
ఇంట్లో నెమలి పింఛం ఉన్నా కూడా శుభప్రదం. రెండు నెమలి పింఛాలను V ఆకారంలో పసుపు దారంతో కట్టి గుమ్మంపై భాగంలో ఉంచితే అదృష్ట లక్ష్మి తలుపుతడుతుంది.
ఇంటి ముందు జంట సింహాలు లేదా ఎద్దుల బొమ్మలు ఉంచడం మంచిదట. ఇవి భోగభాగ్యాలు, సిరిసంపదలను కల్పిస్తాయని అంటున్నారు పండితులు.
రామ టెంకాయ ఉన్నా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కుంకుడు కాయ నుంచి ఉసిరికాయ పరిమాణంలో మార్కెట్లో లభిస్తుంటాయి. పూజా మందిరంలో చిన్న బౌల్లో సింధూరం పోసి ఉంచితే మంచిది.
మధ్యలో "క్లీం", నాలుగువైపులా "శ్రీం" అనే అక్షరాలు ఉండేలా ఒక వెండి ప్లేట్‌ని చేయించుకొని రోజూ దానికి మూడు సార్లు నమస్కారం చేసి అందులో భోజనం చేస్తే అదృష్టం.
మీ వాహనానికి ఆరు గవ్వలు, ఐదు నల్ల జీడి గింజలు కలిపి రాగి తీగతో కట్టిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయట. దీనివల్ల ఇంటికి అదృష్టయోగం వస్తుంది.
మీ ఇంట్లో అభయ హస్తం ఉన్న కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది ఇంటి యజమానికి అదృష్టయోగం, ఐశ్వర్యం ఇస్తుందట.