రోజూ గుప్పెడు పిస్తా తింటే చాలు.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష
19 July 2025
Prudvi Battula
పిస్తాపప్పు ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది. రోజుకు గుప్పెడు అంటే సుమారుగా 30 గ్రాముల మోతాదులో దీన్ని తినవచ్చు.
గుప్పెడు పిస్తా తింటే 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో 13 గ్రాములు ఆరోగ్యకరమైన కొవ్వులు , 6 గ్రాములు ప్రోటీన్లు , 8 గ్రాములు పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్ లభిస్తాయి.
పిస్తా పప్పులో విటమిన్ బి6, బి1, కె, ఇతో పాటు మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.
పిస్తాలోని మోనో అన్‌శాచురేటెడ్, పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్త నాళాల్లో వాపులను దూరం చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది.
ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గాలనుకొనేవారు రోజువారి డైట్లో భాగం పిస్తా పప్పును యాడ్ చేసుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
ఈ పప్పులో లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెటీనాను సంరక్షిస్తాయి. కళ్లలో శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
హిందూ వివాహ ఆచారాలు.. వెనుక ఉన్న సైన్స్..
మీకు యూట్యూబ్‌లో ఫేమస్ కావాలని ఉందా.? ఈ రూల్స్ మస్ట్..
ఈ రాశులవారు బంగారు నగలు ధరిస్తే.. అదృష్టం వైఫైలా కనెక్ట్ కావడం పక్కా