గణేష్ పూజలో తులసిని ఎందుకు వాడరో తెలుసా?
samatha
12 september 2026
Pic credit - Pinterest
హిందూ శాస్త్రం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం నాలుగో రోజున వినాయక చవితి వేడుకలు నిర్వహించు
కుంటారు.
ఈ సంవత్సరం 2026లో సెప్టెంబర్ 14న గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి రెడీ అయ్యారు.
అయితే వినాయకుడికి గరక, దుర్వ గడ్డి ఇలా చాలా రకాల పువ్వులు, పత్రాలు వాడుతారు. కానీ తులసి మాత్రం ఉపయోగించరు.
కాగా, ఇప్పుడు మనం అసలు వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరు. దీని వెనకున్న కథ ఏంటో తెలుసుకుందాం.
ఒకసారి తులసి దేవి యవ్వనంలో గంగాతీరంలో తపస్సు చేస్తుండగా, అదే సమయంలో వినాయకుడు కూడా అక్కడే తపస్సు చేస్
తూ ఉంటాడంట.
అయితే అప్పుడు తులసి వినాయకుడిని చూసి, మోహించి వినాయకుడి తపస్సును భగ్నం చేస్తుంది. అంతే కాకుండా తనను పెళ్లి చేసుక
ోమని కోరుతుందంట.
అప్పుడు వినాయకుడు నేను బ్రహ్మచారిని వివాహం చేసుకోను అని చెప్పగా, తులసి కోపంతో నీకు త్వరలో రెండు పెళ్లీలు అవుతాయని శపిస్తుదంట.
తర్వాత వినాయకుడు కూడా నువ్వు ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంటావని శపిస్తాడంట. దీంతో తన తప్పు తెలుసుకున్న తులసి క్షమాపణ అడిగిందం
ట.
దీంతో వినాయకుడు నువ్వు పవిత్ర మొక్కగా మారుతావు, కానీ నా పూజలో మాత్రం నీకు ఎప్పుడూ స్థానం ఉండదు అని వరం ఇస్తాడంట.
అందుకే తులసి చాలా పూజల్లో ఉపయోగించినా, వినాయకుడి పూజలో ఉపయోగించరు. తులసి లేకుండా పూజ చేస్తేనే వినాయకుడు సంతోషిస్
తాడంట
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?