కుడి చేతితోనే దానధర్మాలు చేయాలంటారు? ఎందుకో తెలుసా?
18 September 2025
Samatha
దానధర్మాలు చేయడం మంచిదని చెబుతుంటారు పండితులు. హిందూ మతంలో దానాలు చేయడం లేదా ధర్మాలు చేయడం అనేది గొప్ప పనిగా వర్ణిస్తుంటారు.
అయితే దాన లేదా ధర్మాలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమ నిబంధనలు పాటించాలంటారు. మరీ ముఖ్యంగా, కుడి చేతితో దానం చేయాలి అంటారు. కాగా, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
కొందరు ఎడమ చేతితో దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు, ఎప్పుడైనా సరే దానం చేసేటప్పుడు తప్పకుండా కుడి చేతితోనే చేయాలని చెప్తారు మన పెద్దవారు
ఎందుకంటే? కుడి చేయి అనేది చాలా శుభప్రదమైన చేయి. అంతే కాకుండా, సూర్యుడు, బృహస్పతిలతో సంబంధం కలిగి ఉంటుందంట. అందుకే కుడి చేతితో చేయడం చాలా మంచిది.
అంతే కాకుండా కుడి చేతితో చేసే దాన ధర్మాలు మంచి ఫలితాలనిస్తాయని, అవి దానం తీసుకున్న వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు పండితులు.
ఎడమ చేయి కుడి చేయికంటే ఎక్కువ శుభప్రదంగా పరిగణించబదు. అందుకే పెద్దవారు , పండితులు ఎప్పుడూ కుడి చేతితోనే దానధర్మాలు చేయాలి ఇది ఆశీర్వాదం లాంటిదని చెబుతుంటారు.
అయితే ఎడమ చేతితో దానధర్మాలు చేయడం అనేది వారి అగౌరవ పరచడం లేదా ఆ కార్యానికే అగౌరవంగా పరిగణించబడుతుందంట. అందుకే ఎడమ చేతితో దానం తీసుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు.
గరుడ పురాణం, ధర్మశాస్త్రాల్లో కూడా దీని గురించి చాలా గొప్పగా వివరించడం జరిగిందంట. నోట్, పైసమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.