మంచి నిద్రకోసం తప్పక తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఇవే!

17 September 2025

Samatha

మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా 7 గంటలు హాయిగా నిద్రపోవాలని చెబుతుంటారు వైద్యులు.

కానీ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా ప్రభావం వలన చాలా మంది నిద్రపోవడం కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గడిపేస్తున్నారు.

ఇంకొందరు మానసిక ఒత్తిడి, స్ట్రెస్ వంటి వలన సరిగ్గా నిద్రపోవడం లేదు, కాగా, అసలు మంచి నిద్ర కోసం ఎలాంటి పండ్లు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన మంచి నిద్ర వస్తుందంట.

కివీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వలన కూడా మంచి నిద్ర పడుతుందంట.

టార్ట్ చెర్రీస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక మొత్తంలో మొలటోనిన్ ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ప్రశాంతమైన నిద్ర పడుతుందంట.

రాత్రి సమయంలో గోరు వెచ్చటి పాలు తాగడం వలన మంచి, సుఖవంతమైన నిద్ర పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.