బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్.. ఈ పండుగ ప్రత్యేకత ఇదే! 

15 September 2025

Samatha

బొడ్డెమ్మ పండు సంబరాలు తెలంగాణలో మొదలు అయ్యాయి. బొడ్డమ్మతో మొదలై విజయదశమితో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి.

బొడ్డెమ్మ పండుగ తొమ్మదిరోజుల పాటు జరుపుకుంటారు, దీనిని బాలికల పండుగ అని, మట్టిపూల పండుగ అని కూడా అంటారు.

ఆడపడుచులు, చిన్నాపెద్దా అందరూ కలిసి మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి తీరొక్కపూలతో అందంగా అలంకరించి పాటలతో బొడ్డెమ్మ సెలబ్రేట్ చేస్తారు.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ అంటూ.. బిడ్డాలెందారే కోల్ అంటూ పాటలు పాడుకుంటూ, మహిళలు,  చిన్నపిల్లలు అందరూ కలిసి బొడ్డెమ్మ ఆడుతారు.

ఆట ముగిశాక నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా అంటూ.. గౌరీ దేవిని నిద్రపుచ్చి, అందరికీ ప్రసాదం ఇచ్చి, బొడ్డెమ్మను పూజగదిలో పెట్టేస్తారు.

ఈ బొడ్డెమ్మను మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు నోములా వేస్తుంటారు. ముఖ్యంగా యువతులు బొడ్డెమ్మెను ఎక్కువగా వేస్తుంటారు.

ఎందుకంటే?  త్వరగా పెళ్లికావాలని, వైవాహిక జీవితం బాగుండాలని గౌరీదేవికి చేసే నోము ఇది. దీని వలన అమ్మాయికి మంచి భర్త వస్తాడని నమ్మకం.

తొమ్మిది రోజుల పాటు గౌరీదేవిని కొలుచుకొని, పువ్వులతో అందంగా అలంకరించి, ఆటలు ఆడుతారు, తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు.

చివరి రోజున గౌరీదేవీని పూజించి, కుడుములు సమర్పించి, పోయిరా బొడ్డెమ్మ పోయిరా వమ్మా.. అంటూ పాడలు పాడుతూ నిమజ్జనం చేస్తారు. దీంతో బొడ్డెమ్మ పండుగ వేడుకలు పూర్తి అవుతాయి.