ఇంటి ముందు ముగ్గులు ఎందుకు.? వాస్తవం ఏంటి.? 

06 October 2025

Prudvi Battula 

ముగ్గు అంటే భూమిని అందంగా అలంకరించడం. సుందరంగా అలంకరించి ఉన్న భూమాతను చూస్తే కొన్ని పీడలు నివారింపబడతాయి.

ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. కళ్ళాపు జల్లి ఇంటి వాకిళ్ళులో ముగ్గులు పెట్టడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం.

ముగ్గుల్లో చాలా రకాలున్నాయి. ఇంటి ముందు రెండు అడ్డగీతలు ముగ్గుని పెడితే దుష్టశక్తులను బయటకి పంపుతాయి. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి.

ఒక ముగ్గుకి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్ధం.

నక్షత్రం ఆకారంతో ముగ్గు వేస్తే.. అది భూత, ప్రేత, పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని హిందువుల నమ్మకం.

పద్మ ముగ్గు , చుక్కల ముగ్గులు కేవలం గీతాలు మాత్రమే కాదు.. యంత్రాలు కూడా. వీటిని ఇంటికి శుభప్రదంగా భావిస్తారు.

గుడిలో లేదా అమ్మవారు ముందు కానీ.. శ్రీ మహావిష్ణువు ముందు కానీ.. రొజూ ముగ్గు పెట్టె స్త్రీ జీవితాంతం సుమంగళిగా ఉంటుందని భాగవతం, బ్రహ్మాండపురాణల్లో ప్రస్తావించబడింది.

నిత్యం ఇంటి ముందు లేదా వెనుక భాగంలో.. అలాగే తులసి ముందు ముగ్గు వేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరిగి దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.