భయపెడుతున్న మౌని అమావాస్య..70 ఏళ్ల కిందట కుంభమేళాలో ఏం జరిగిందంటే?
samatha.j
28 January 2025
Credit: Instagram
మౌనీ అమావాస్య వచ్చేసింది. బుధవారం మౌని అమావాస్య. కానీఇది మంగళవారం సాయంత్ర ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్నదంటున్నారు పండితులు.
అన్ని అమావాస్యల్లోకెళ్లా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున కుంభమేళాలో స్నానాలు ఆచరించడం వలన పుణ్యం లభిస్తుందంటారు పండితులు.
అందుకే కోట్లాది మంది భక్తులతోపాటు, లెక్కలేనంత మంది నాగసాధువులు. అఘోరాలు , పండితులు ఇలా చాలా మంది కుంభమేళాలకు వెళ్లి స్నానాలు ఆచరిస్తారు.
దీంతో ఈ రోజు ప్రయోగరాజ్ మహాకుంభమేళకు వెళ్లే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎందుకంటే మౌనీ అమావస్య రోజు 70 ఏళ్ల కిందట ఓ ఘోర సంఘటన జరింగిందంట.
1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య రోజు మహాకుంభమేళాకు చాలా మంది భక్తలు వెళ్లారంట. ఆ రోజు తొక్కిసలాట జరగడంతో వందల మంది భక్తులు మరణించారంట.
దీంతో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజకీయనాయకులు, కుంభమేళాను సందర్శించడానికి వెళ్లకూడదని సూచించారంట. ఆ ఘటన ఇప్పటికీ అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది
అయితే దీని తర్వాత కూడా తొక్కిసలాట జరిగింది. 1840, 1906, 1954, 1986, 2003, 2010లోనూ కుంభమేళాలో పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయ్.
అలాగే 2013 లో మౌనీ అమావాస్య రోజు కుంభమేళాలో అలహాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు. అందువలన కుంభమేళకు వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలంట.