అదృష్టం పట్టాలంటే ఏ రోజు ఏ రంగు డ్రెస్ వేసుకోవాలి?
21July 2025
Prudvi Battula
భారతీయ సంప్రదాయంలో వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు వేసుకున్న డ్రెస్ రంగును బట్టి కూడా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు.
సోమవారం: తెలుపు రంగు స్వచ్ఛత, శాంతితో ముడిపడి ఉంటుంది. సోమవారం తెల్లపు దుస్తులు శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మంగళవారం: ఎరుపు రంగు అంగారక గ్రహంతో ముడిపడి ఉంటుంది. ఇది శక్తిని సూచిస్తుంది. మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అన్ని శుభాలే.
బుధవారం: బుధవారం రోజున మీ నచ్చిన శైలిలో ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వల్ల పెరుగుదల, సామరస్యాన్ని సూచిస్తుంది.
గురువారం: ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం లబిస్తుంది. ఇది సానుకూలతతో ముడిపడి ఉంటుంది.
శుక్రవారం: గులాబీ లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం అనుకూలంగా ఉంటుంది. ఈ రంగులు అందం, ప్రశాంతతను సూచిస్తాయి.
శనివారం: శనివారం రోజు నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులను కట్టుకోవడం క్రమశిక్షణ, రక్షణను సూచిస్తుంది.
ఆదివారం: నారింజ రంగు సూర్యునికి, తేజస్సుకు సంబంధించినది. ఆదివారం ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగుతో ఈ కూరగాయలు తింటే యమ డేంజర్
రోజూ గుప్పెడు పిస్తా తింటే చాలు.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష
అదృష్టం, ఐశ్వర్యం మీ ఇంటి తలుపు తట్టాలంటే..