విదుర నీతి : కలలో కూడా ఈ నలుగురిని అవమానించకూడదు!

samatha

02 may 2026

మహాత్మ విదుర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చాలా విషయాల గురించి మహాభారతంలో తెలియజేసిన విషయం తెలిసిందే.

మహాత్మ విదురుడు

అదే విధంగా ఆయన తన విదుర నీతిలో ఒక వ్యక్తి కలలో కూడా నలుగురుని అవమానించకూడదు అని తెలియజేశాడు. వారు ఎవరంటే?

నలుగురు వ్యక్తులు

విదురుడు మహాభారతంలో హస్తినా పురానికి మంత్రిగా, సలహాదారుగా ఉంటూ, కౌరవులకు, పాండవులకు ఎన్నో సూచనలు చేస్తాడు.

హస్తిన పురం

ముఖ్యంగా విదురుడు ధృతరాష్ట్రులు వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ఆయన ఎన్నో నీతి వ్యాఖ్యలు తెలుపుతాడు. అవి నేటి తరం వారికి ఉపయోగపడుతున్నాయి.

నీతి వ్యాఖ్యలు

అదే విధంగా ఆయన తన విదుర నీతిలో ఒక వ్యక్తి కలలో కూడా నలుగురుని అవమానించకూడదు అని తెలియజేశాడు. వారు ఎవరంటే?

విదుర నీతి

పాము అందరికీ తెలిసిందే, అయితే ఇది చాలా తెలివైనది, చురుకైనది. దీనిని అవమానించడం అస్సలే మంచిది కాదంట, దీని ప్రతీకారం, ప్రమాదకరంగా ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి జీవితంలో గౌరవం, జాగ్రత్తను నేర్పుతుంది.

పాము

అలాగే పంచ భూతాల్లో ఒక్కటైన, అగ్నిని అవమానించడం జీవితానికి హానికరం. అగ్ని జీవానికి, శక్తికి ప్రతీక. దానిని అగౌరవ పరచడం కష్టాలకు, వైఫల్యానికి దారితీస్తుంది.

అగ్ని

సింహం ఒక శక్తివంతమైన, ధైర్యవంతుడైన జీవి. దానిని అగౌరవ పరచడం ప్రమాదాన్ని, వినాశనాన్ని ఆహ్వానిస్తుంది. ఇది బలవంతులైన, ధైర్యవంతులైన వ్యక్తులను గౌరవించాలని మనకు నేర్పుతుంది.

సింహం

మీ వంశాన్ని, కుటుంబాన్ని అగౌరవ పరచడం మీ గౌరవానికి, సామాజిక హోదాకు హాని కలిగిస్తుంది. అది సంబంధాలలో ఉద్రిక్తతకు, వ్యక్తిగత బలహీనతకు కారణం కావచ్చు.

కుటుంబం