విదుర నీతి: ఈ నలుగురికి అస్సలు నిద్ర పట్టదట.. వారెవరో తెలుసా?

November 13, 2026

Rajashekher

తనకంటే బలవంతుడైన శత్రువు వేధింపులకు గురిచేస్తున్నప్పుడు బలహీనుడికి భయం, ఆందోళన కలుగుతాయి. తన భవిష్యత్తు, రక్షణ గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతాడు.

శత్రువు చేతిలో చిక్కిన బలహీనుడు: 

కష్టపడి సంపాదించిన ధనాన్ని కోల్పోయిన వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురవుతాడు. కోల్పోయిన సంపదను, ఆర్థిక పరిస్థితిని తలచుకుంటూ నిద్రపోలేడు.

సంపదను కోల్పోయిన వ్యక్తి:

ఎవరి ఇంట్లో దొంగతనం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనే ఆలోచనలతో దొంగ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. తన పథకాలను అమలు చేసే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు.

దొంగతనానికి ప్రణాళికలు రచించేవాడు:

పరాయి స్త్రీల పట్ల మోహం కలిగిన వ్యక్తిని కామాకులచిత్తుడు అంటారు. ఇతరుల భార్యలపై ఆకర్షణతో అతని మనస్సు అశాంతికి గురవుతుంది. ఆ కోరికలు అతనికి నిద్ర లేకుండా చేస్తాయి.

కామాకులచిత్తుడు:

తనకంటే శక్తివంతుడైన వ్యక్తి నుంచి ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు మనిషి ప్రశాంతంగా నిద్రపోలేడు.

భయం నిద్రను దూరం చేస్తుంది:

సంపద కోల్పోయిన బాధలో నిరంతరం మునిగిపోయేవారికి మానసిక ప్రశాంతత కరువవుతుంది.

ధనంపై అతిగా ఆందోళన అనర్థం:

దొంగతనం వంటి తప్పుడు పనులకు ప్రణాళికలు వేసేవారి మనస్సు ఎప్పుడూ అప్రమత్తత, భయంతో నిండిపోతుంది.

చెడు ఆలోచనలు అశాంతికి కారణం:

పరాయి స్త్రీలపై మోహం వంటి తప్పుడు ఆకర్షణలు మనిషిని మానసికంగా అశాంతికి గురిచేస్తాయి. భయం, ధననష్టం, చెడు ఆలోచనలు, అనుచితమైన కోరికలు మనిషి ప్రశాంతతను దూరం చేస్తాయని విదురుడు తన బోధనల ద్వారా తెలియజేశాడు.

అనుచితమైన కోరికలు మనశ్శాంతిని..