ఇంట్లో చెప్పులు వేసుకోవాలా వద్దా? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే
26 May 2025
Pic credit: Google
TV9 Telugu
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నెలకొని, ఆనందం, శాంతిని కాపాడుతుంది.
కానీ వాస్తు ప్రకారం మనం చేయకూడని కొన్ని తప్పులు ఉన్నాయి. లేకుంటే మనకు ప్రయోజనాలకు బదులుగా నష్టాలు ఎదురవుతాయి.
చెప్పులు ధరించడం, తీయడం గురించి వాస్తు శాస్త్రంలో కూడా నియమాలు ఉన్నాయి. కనుక వాస్తు ప్రకారం ఇంట్లో చెప్పులు ధరించాలా..? వద్దా? తెలుసుకుందాం.
ఇంట్లో బూట్లు, చెప్పులు వేసుకోకూడదు. నిజానికి ఇది శాస్త్రీయ దృక్కోణం నుంచి సరైనది కాదు. వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం ప్రకారం కూడా ఇది సరైనది కాదు.
బూట్లు , చెప్పులు బయట ధరించడానికి తయారు చేస్తారు. అయితే వీటిని ఇంటి లోపల ధరించడం వల్ల ప్రతికూల శక్తి ఉంటుంది. శనీశ్వరుడి అశుభ నీడ కూడా ఇంట్లో ఉంటుంది.
ఇంట్లో చెప్పులు ధరించడం వల్ల ఆనందం, శాంతి కూడా దెబ్బతింటుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. పేదరికానికి కూడా కారణం కావచ్చు.
పొరపాటున వంటగదిలోకి , స్టోర్‌హౌస్‌లోకి లేదా ఆలయంలోకి చెప్పులు తీసుకురాకూడదు. ఎందుకంటే ఇది సంపదను నాశనం చేస్తుంది.
అలాగే మీరు పడుకునే గదిలో లేదా మంచం దగ్గర బూట్లు, చెప్పులు పెట్టుకోరాదు. ఇలా చేయడం వలన మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
ఇది మాత్రమే కాదు మీరు బయటి నుంచి వచ్చిన వెంటనే.. ఆ చెప్పులతో ఇంట్లోకి ప్రవేశించకూడదు. ఎందుకంటే అలా చేయడం వలన ఇంట్లో అశాంతి కలుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెసర మొలకలు తింటున్నారా.. ఏ సమయంలో తింటే ప్రయోజనమో తెలుసా..
ప్రతిరోజు ఇంటి ముందుకు ఆవు రావడం దేనిని సూచిస్తుంది?
ఇంటి లోపల లేదా ఇంటి ముందు అరటి చెట్టును నాటడం శుభమా లేదా అశుభమా?